المدة الزمنية 5:42

మైదా లేకుండా గోధుమ పిండితో పిజ్జా ఇలా చేసుకోండి | wheat flour pizza recipe

بواسطة Siri Vantalu
1 288 064 مشاهدة
0
10.6 K
تم نشره في 2019/05/20

మొదట పిజ్జా సాస్ చేసుకుందాం, 1 ఒక స్పూన్ నూనె వేడిచేసుకుని అందులోకి 3 స్పూన్ల కట్ చేసిన ఉల్లిపాయలు వేసుకోండి 2 మూడు వెల్లుల్లిపాయలు వెయ్యండి । ఒక నిమిషం పాటు ఫ్రై చెయ్యండి 3 మూడు టొమాటోలు వేసుకోండి । మూత పెట్టి టొమాటోలు మగ్గేదాకా ఉడికించండి 4 సగం స్పూన్ (1 /2 ) చెక్కర , కొద్దిగా కారం పొడి (లేదా ఎండు మిరపకాయలు వేసుకోవచ్చు ), సరిపడా ఉప్పు వేసుకుని కలుపుకోండి 5 సగం స్పూన్ (1 /2 ) ఒరేగనో (Oregano ) , సగం స్పూన్ బేసిల్ (Basil ) వేసుకోండి । ఈరెండు మూలికలు మీకు అందుబాటులో లేకపోతే వేసుకోకపోయినా పిజ్జా బానేవుంటుంది । ఈరెండు బిరియాని ఆకులవంటివి 5 రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి । తరువాత మెత్తగా మిక్సీ పట్టండి- పిజ్జా సాస్ రెడీ ఐపోయినట్టే ఇప్పుడు పిజ్జాకి పిండికలుపుకుందాం 1 ఒక కప్ గోధుమ పిండి (150grms ) 2 ఒక టీ స్పూన్ బేకింగ్ సోడా (1 tsp ) । సగం టీ స్పూన్ బేకింగ్ పౌడర్ (1 /2 tsp ) । ఒక టీ స్పూన్ (1tsp )) చెక్కెర వేసుకుని ఒకసారి కలుపుకోండి 3 నీళ్లు వాడకుండా తగినంత పెరుగు వేసుకుని పిండిని కలుపుకోండి । ఐదు నిమిషాల పాటు పిండిని బాగా పిసకండి। 4 ఒక స్పూన్ నూనె ( 1tsp ) వేసుకుని పిండిని ఇంకో మూడు నిమిషాలు పిసకండి 5 పిండిని రెండు భాగాలుగా చేసుకోండి । రెండు పీజ్జాలు అవుతాయి 6 ఒక స్టీల్ ప్లేట్ తీసుకుని దానికి నూనె రాసి పెట్టుకోండి । ఒక పిండి భాగాన్ని చపాతీ కంటే కొద్దిగా మందంగా తిక్కుకుని ప్లేట్ మీద వేసుకోండి । ఒక ఫోర్క్ తో పిండి మీద చిన్నరంధ్రాలు చెయ్యండి - పిండి ఎక్కువగా పొంగకుండా ఉండడానికి 7 దీనిమీద ఇందాక చేసిపెట్టుకున్న పిజ్జా సాస్ రాయండి । చీజ్ తురుము వేసుకోండి ( shredded cheese ) లేదా చీజ్ ని చిన్న ముక్కలుగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు 8 పెద్ద ముక్కలుగా కట్చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, గ్రీన్ కాప్సికం, యెల్లో కాప్సికం వేసుకోండి । ఇవే వేసుకోవాలి అని ఏం లేదు మీరు పాలకూర లేదా పనీర్ లేదా పైనాపిల్ (pineapple) ముక్కలైన వేసుకోవచ్చు 9 కరిగించిన వెన్న ( melted butter ) లేదా నెయ్యి అయినా పిజ్జా చివర్ల మీద రాయండి । ఇప్పుడు పిజ్జా వండుకోడానికి ( బేక్ ) రెడీగ ఉంది 10 ఒక వెడల్పాటి గిన్నెలో 1 కప్ ఉప్పు వేసి ఒక 10 నిమిషాలు పెద్ద మంట మీద మూతపెట్టి వేడి చెయ్యండి (preheat) 11 ఇలా బాగా వేడైన గిన్నెలో ఒక స్టాండ్ లాంటిది పెట్టి మనం తయారు చేసిపెట్టుకున్న పిజ్జా ప్లేట్ ని పెట్టి ఒక 10 నుంచి 12 నిమిషాలు మధ్యరకం వేడి మీద వండండి (bake on medium heat ) 12 పిజ్జా రెడీ అయిపోయింది । ఇంకో పిండి ముద్దతో ఇదేవిధంగా ఇంకో పిజ్జా చేసుకోండి 100% wheat flour pizza recipe in telugu మైదా లేకుండా గోధుమ పిండితో పిజ్జా ఇలా చేసుకోండి Follow Siri Vantalu on Facebook: https://www.facebook.com/Siri-Vantalu-437499706793793/ Please check out my other recipes here: Super soft Milk bread recipe on stove top: /watch/0xPUxSk01a60U Whole wheat bread recipe on stove top: /watch/oUC__IkrPimr_ Homemade Brown bread recipe without yeast: /watch/Ax6ba7SfNLGfb White bread recipe on stove top: /watch/Qbahui_lgUalh

الفئة

عرض المزيد

تعليقات - 516